- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ ఎమ్మారై స్కాన్ కేవలం రూ.50..!
X
దిశ, వెబ్ డెస్క్: భారత దేశంలో అత్యంత తక్కువ ధరకు సేవలందించే డయాగ్నస్టిక్ సెంటర్ ఢిల్లీలోని గురుద్వార బాంగ్లా సాహిబ్‌లో త్వరలో ప్రారంభం కానుంది. ఈ మేరకు గురుద్వార కమిటీ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్‌లో ఈ చౌక ధర ల్యాబ్‌ను ప్రారంభిస్తామని గురుద్వార మేనేజ్‌మెంట్ కమిటీ తెలిపింది.
అంతేకాకుండా.. గురుద్వారకు అనుబంధంగా ఏర్పాటు చేసిన గురు హరిక్రిషన్ ఆస్పత్రిలో వచ్చే వారం నుండి ఓ డయాలిసిస్ సెంటర్ కూడా ప్రారంభమవుతుందని, అక్కడ కేవలం రూ.600కే డయాలిసిస్ అందుబాటులో ఉంటుందని తెలిపింది.
కోట్ల ఖరీదు చేసే డయాగ్నస్టిక్ యంత్రాలు ఆస్పత్రికి విరాళంగా అందాయని కమిటీ సభ్యులు తెలిపారు. అత్యవసరమైన వారికి ఎమ్మారై స్కాన్ రూ.50కే అందిస్తామని, ఇతరులకు రూ.800ల నామమాత్రపు ఫీజు తీసుకుంటామన్నారు. అయితే ఎవరికి ఈ కన్సెషన్ ఇవ్వాలో నిర్ణయించేందుకు డాక్టర్లతో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని వారు తెలిపారు.
Advertisement
Next Story