కరోనాతో ఎంపీటీసీ మృతి

by Sridhar Babu |
కరోనాతో ఎంపీటీసీ మృతి
X

దిశ, జమ్మికుంట: హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఇల్లందకుంట మండలం రాచపల్లి ఎంపీటీసీ సభ్యురాలు చిరునాగుల నరసమ్మ (55) కరోనాతో మృతి చెందినట్టుగా గ్రామస్తులు తెలిపారు. నరసమ్మ కు వారం రోజుల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెను అత్యవసర చికిత్స నిమిత్తం వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడంతో కరీంనగర్కు తీసుకువచ్చారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందింది. కాగా నరసమ్మ రెండు సార్లు రాచపల్లి గ్రామ సర్పంచ్ గా పని చేశారు.

Advertisement

Next Story