- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉపాధి హామీ పథకమే భేష్.. ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వండి
దిశ, కాటారం: నిరుపేద కూలీలకు ఉపాధి హామీ పథకం తోనే గిట్టుబాటు అవుతుందని, ఎక్కువ మందికి పనిదినాలు కల్పించేలా గ్రామస్థాయిలో ఉపాధిహామీ సిబ్బంది కృషి చేయాలని కాటారం మండల పరిషత్ అధ్యక్షులు పంతకాని సమ్మయ్య అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ కార్యదర్శుల తో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీపీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్రతి కుటుంబానికి 100 రోజులు పని చేస్తే రోజుకు 243 రూపాయల చొప్పున మొత్తం 24300.00 వస్తాయని అన్నారు. తక్కువ పని చేయడం వల్ల సగటు ఆదాయం తగ్గుతుందని ఈ విషయాన్ని కూలీలకు అవగాహన కల్పించాలని కోరారు.
ఈ సందర్భంగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ.. మండలంలో మంజూరు చేయబడిన బృహత్ పల్లె ప్రకృతి వనాలలో త్వరితగతిన మొక్కలు నాటాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో నర్సరీ పనులు త్వరగా పూర్తి చేయాలని, వాచర్ పేమెంట్ కొరకు మస్టర్ లు యం.సి.సి లో అప్పగించాలని కోరారు. సమావేశంలోఎ.పి.ఓ వెంక న్న , ఈసీ యం.శ్రీకాంత్, టెక్నికల్ అసిస్టెంట్లు మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.