- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఆకలి తీర్చుకోవడానికి మంగళ‘సూత్రం’
భోపాల్ : లాక్ డౌన్ చిరువ్యాపారులకు ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టింది. రెక్కాడితే గానీ డొక్కాడని వారి జీవితాలు.. దయనీయంగా మారాయి. పూట గడవని పరిస్థితి ఏర్పడింది. ఆకలితో అలమటించి.. విలవిలలాడిపోతున్నారు. కుటుంబాన్ని పోషించేందుకు ఓ మహిళ.. తన మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టింది. భోపాల్ కు చెందిన ఓ మహిళ.. స్థానికంగా ఉన్న గుడి వద్ద పూజా సామగ్రి అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఆలయాలు మూసివేయడంతో.. ఆమె బతుకుదెరువు కష్టంగా మారింది. కుటుంబాన్ని పోషించడం భారంగా మారింది. దీంతో తన పుస్తెలతాడును రూ. 5 వేలకు తాకట్టు పెట్టింది.
ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ.. ప్రస్తుతం ఆలయం తెరిచినా భక్తులు రావడం లేదు. త్వరలోనే భక్తులు వస్తారని ఆశిస్తున్నాను. లాక్ డౌన్ వల్ల ఆకలితో చస్తున్నాం.. అందుకే మంగళసూత్రాన్ని తాకట్టుపెట్టాల్సి వచ్చింది. ఆ డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తున్నాను. భర్తకు పక్షవాతం రావడంతో.. ఆయన కూడా పని చేసే స్థితిలో లేడు. కుమారుడు పెట్రోల్ బంక్ లో పని చేస్తున్నాడు’ అని ఆమె తెలిపింది.