- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతి పంచాయతీకి ఒక టీవీ : ఎంపీ
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: వికారాబాద్ జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీకి, తన సొంత నిధులతో ఒక టీవీ అందజేయనున్నట్టు చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఐటీ మంత్రి కేటీఆర్‌ను కలిసి, టీవీలకు అయ్యే ఖర్చును చెక్ రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ…
కరోనా నేపథ్యంలో ఇప్పటికే చాలామంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లోనే విద్యానభ్యసిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఆన్లైన్ విద్యాబోధన ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ప్రతి గ్రామ పంచాయతీకి టీవీ బహుకరించడంతో విద్యార్ధుల సమస్యలు తీరుతాయన్నారు. ఇంట్లో టీవీ లేని కారణంగా ఏ ఒక్క విద్యార్థి చదువుకు దూరం కాకుడదనే ఆలోచనతో టీవీలు అందజేయడం జరుగుతుందన్నారు.
ఇప్పటికే ఐటీ మంత్రి కేటీఆర్, తెలంగాణను డిజిటలైజేషన్ దిశగా నడిపిస్తున్నరని తెలిపారు. అదేవిధంగా తన పార్లమెంట్ పరిధిలోని ప్రతి గ్రామపంచాయతీలో టీవీలను ఈ-పరిపాలన కోసం వీడియో కాన్ఫరెన్స్, సమాచార సాధనాలుగా ఉపయోగించుకోవాలని స్థానిక సర్పంచ్‌లకు ఎంపీ రంజిత్ రెడ్డి సూచించారు. జిల్లాలో దాదాపు 400పైగా టీవీలు అందజేయనున్నట్టు స్పష్టం చేశారు.