మత మార్పిడులను ప్రోత్సహిస్తున్నారు !

by srinivas |
MP Raghurama Krishnam Raju
X

దిశ, ఏపీ బ్యూరో: రాజ్యాంగాన్ని కాలరాస్తూ మత మార్పిడులను ప్రోత్సహించే విధంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బుధవారం ప్రధాని మోడీకి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. రాష్ట్రంలో 30వేల మంది చర్చి పాస్టర్లకు నెలకు రు.5వేలు ఇవ్వాలని ప్రభుత్వం అధికారికంగా జీఓ విడుదల చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇది రాష్ర్టంలో క్రిస్టియన్ జనాభా పెరుగుదల కోసమేనని పేర్కొన్నారు. ప్రజల డబ్బును క్రిస్టియన్ మత వ్యాప్తికి ఉపయోగించడం రాజ్యాంగ నియమాలను ఉల్లంఘించడమేనని లేఖలో వెల్లడించారు. 2011లో 1.8శాతం ఉన్న క్రిస్టియన్ జనాభా ఇప్పుడు 25శాతం పెరిగినట్లు తెలిపారు. ఇది అధికారికంగా ప్రభుత్వ రికార్డులోకి రావడం లేదన్నారు. ఇలా మతం మారిన వాళ్లు తప్పుడు డిక్లరేషన్ ఇచ్చి చట్ట సభలకు కూడా వస్తున్నట్లు పేర్కొన్నారు. మరికొందరు విద్యా, ఉద్యోగ రిజర్వేషన్లు కూడా వాడుకుంటున్నట్లు లేఖలో వివరించారు. దీన్ని అడ్డుకోవాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story