- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'కేసీఆర్ లాగా నేను మాట తప్పను.. నోరు పారేసుకోను'
దిశ, యాదగిరిగుట్ట: హామీలు ఇచ్చి ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి ఓ మూర్ఖుడని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైరయ్యారు. శుక్రవారం బొమ్మలరామారం మండలంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్ ది నాలుకా లేక తాటి మట్టనా అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తానని ఎన్నికల సమయంలో, అసెంబ్లీలో మాటిచ్చిన కేసీఆర్ ఇప్పుడు అనలేదంటూ మాట తప్పడం సమంజసమేనా అని ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిపించి.. టీఆర్ఎస్ ను ఓడించి కేసీఆర్ కు సరైన గుణపాఠం చెప్పాలన్నారు.
సీఎంగా మాట ఇస్తే ఎట్టి పరిస్థితుల్లో తప్పకూడదని హితవు పలికారు. అవసరమైతే తన సొంత నిధులతో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటానని, కానీ.. కేసీఆర్ లాగా మాట తప్పను.. నోరు పారేసుకోనన్నారు. ప్రజల కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం సొంత ఆస్తులు అమ్ముకున్నాం.. ఇంకా కూడా అమ్ముకుంటున్నాం.. కానీ, టీఆర్ఎస్ నాయకుల్లాగా భూములపై పడి దోచుకోవడంలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు నియోజకవర్గ ఇన్ చార్జ్ బీర్ల ఐలయ్య, బొమ్మల రామారం మండలానికి చెందిన కాంగ్రెస్ సర్పంచ్ లు కళ, మహేష్ గౌడ్, ఎంపీటీసీలు హేమంత్ రెడ్డి, శ్రీహరి నాయక్, మండల అధ్యక్షులు సింగిర్తి మల్లేశం, నాయకులు బాబు, శ్రీకాంత్, రాజేష్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.