అదో అద్బుతమైన కట్టడం….

by srinivas |   ( Updated:2020-10-16 06:08:57.0  )
అదో అద్బుతమైన కట్టడం….
X

దిశ, వెబ్ డెస్క్:
దేశంలోనే విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్ ఓ అద్బుతమైన కట్టడమని ఎంపీ కేశినేని నాని అన్నారు. దుర్గాగుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవంలో ఆయన శుక్రవారం పాల్గొన్నారు. కనక దుర్గ ఫ్లై ఓవర్‌తో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయని ఆయన తెలిపారు. టీడీపీ హయాంలో కేంద్ర మంత్రుల సహకారంతో ఏపీకి పలు ప్రాజెక్ట్‌లు వచ్చాయని ఆయన తెలిపారు. బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ కూడా విజయవాడ వాసుల కల అని ఆయన తెలిపారు.

Advertisement

Next Story