- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకం: జీవీఎల్
by srinivas |
X
దిశ, ఏపీ బ్యూరో: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు విప్లవాత్మకమైనవని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలపై సూచనలు వింటామన్నారు. కానీ వెనకడుగేసేది లేదని స్పష్టం చేశారు. ఈ చట్టాలు 30, 40 ఏళ్ల క్రితం ప్రవేశపెట్టి ఉంటే రైతుల జీవితాలు బాగుపడేవని వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాల రూపకల్పనలో మేధావులు, నిపుణులు అభిప్రాయాలు తీసుకున్నట్లు తెలిపారు. చట్టాలపై కొంతమంది అపోహలు సృష్టించి ఆందోళనకు గురిచేస్తునట్లు పేర్కొన్నారు. కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం రైతులు పండించిన పంటను మార్కెట్ యార్డ్ బయట అమ్ముకోవచ్చని చెప్పారు. మార్కెట్ యార్డ్‌కు సెస్ కట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్త వ్యవసాయ చట్టాలపై అసత్యాలను నమ్మొద్దన్నారు.
Advertisement
Next Story