- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ అంటే ఏమీ చేతకాని ప్రభుత్వం: బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు
దిశ, ఏపీ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా వైసీపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. యూపీ తర్వాత కేంద్రం నుంచి అత్యధికంగా నిధులు అందుకుంటున్న రాష్ట్రం ఏపీనే అంటూ జీవీఎల్ క్లారిటీ ఇచ్చారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సైతం వైసీపీ ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకోవడం దుర్మార్గమన్నారు. ఢిల్లీలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర పథకాలకు సొంత పేర్లు పెట్టి రాష్ట్ర పథకాలుగా చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. కేంద్ర పథకాలు అమలు చేయాలంటే.. కేంద్రం, రాష్ట్రం రెండూ నిధులు విడుదల చేయాల్సి ఉంటుందని, అయితే కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిధులు విడుదల చేయడం లేదని దీంతో అభివృద్ధి నిలిచిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కేంద్రం నిధులు కూడా ఆగిపోతున్న పరిస్థితులు నెలకొందన్నారు.
వైసీపీ ప్రభుత్వ అసమర్థతతో అభివృద్ధికి ఆమడదూరంలో ఏపీ నిలుస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక వైఫల్యం అనే అంశంపై ఎవరైనా అధ్యయనం చేయాల్సి వస్తే అందుకు ఏపీనే సరైన రాష్ట్రం అంటూ సెటైర్లు వేశారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలతో ప్రజలను దోచిన ప్రభుత్వం తాజాగా ఓటీఎస్ పేరుతో మరో కొత్త దోపిడీకి శ్రీకారం చుట్టారని ఎంపీ జీవీఎల్ ఘాటు విమర్శలు చేశారు. అందుకే వైసీపీ అంటే.. ఏమీ చేతకాని ప్రభుత్వంగా మారిపోయిందని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులు రోజు రోజుకు ఎక్కువ అయిపోయినట్లు విమర్శించారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ నెల 28న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు.