కరోనాపై ఎంపీ సోయంబాపురావు ఆరా

by Aamani |   ( Updated:2020-04-04 05:15:52.0  )

దిశ, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో కరోనా నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఎంపీ సోయం బాపురావు కలెక్టర్‌తో శనివారం సమావేశమై చర్చించారు. నిర్మల్‌లో ఒకరు మరణించడం, కొందరికి కరోనా లక్షణాలు ఉండటంతో స్థానికులు ఆందోళనలకు గురవుతున్నట్టు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా కేంద్రంలో సర్వే నిర్వహిస్తున్న ఆరోగ్య సిబ్బందికి మరింత రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోడీ పిలుపు మేరకు ఆదివారం రాత్రి దీపాలు వెలిగించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. జన్ ధన్ ఖాతాల్లో రూ. 500లను కేంద్ర ప్రభుత్వం ద్వారా జమ చేస్తున్నామని, దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని కలెక్టర్‌ను కోరారు.

Tags: Adilabad,mp soyambapurao,Nirmal collector

Advertisement

Next Story

Most Viewed