ఓటమి భయంతోనే మాపై దాడులు : బండి

by Shyam |
BJP leader Bandi Sanjay
X

దిశ, తెలంగాణ బ్యూరో : నాగర్​కర్నూల్​ జిల్లా అచ్చంపేటలో బీజేపీ రాష్ట్ర ఇంచార్జ్​తరుగ్​చుగ్ ర్యాలీపై టీఆర్ఎస్​నేతలు కావాలనే దాడి చేశారని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. శనివారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. అధికార పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని,మున్సిపల్​ఎన్నికల్లో తెరాస అభ్యర్థులు పరాజయం పాలైతారనే అసహనంతోనే దాడులకు దిగుతున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో శాంతి, భద్రతలు క్షీణించాయని, అందుకు తాజాగా అచ్చంపేటలో బీజేపీ నేతలపై జరిగిన దాడే నిదర్శమన్నారు. దాడులు జరుగుతున్న పోలీసులు స్పందించడం లేదని, టీఆర్ఎస్ నేతలకు కొమ్ముకాస్తు బీజేపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తెరాస నాయకుల ఒత్తిడితోనే పోలీసులు బీజేపీ కార్యకర్తలను విచక్షణారహితంగా కొట్టారన్నారు. టీఆర్ఎస్ సర్కారు శాశ్వతంగా అధికారంలో ఉండబోదని, రాబోయేది బీజేపీ ప్రభుత్వమేననే విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు.

Advertisement

Next Story