కర్ఫ్యూ సడలించండి : ఓవైసీ

by Shyam |
కర్ఫ్యూ సడలించండి : ఓవైసీ
X

దిశ, తెలంగాణ బ్యూరో : కర్ఫ్యూ సమయంలో మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఎంపీ కోరారు. ఈ నెల 20 నుంచి 30 వరకూ రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకూ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్, కర్ఫ్యూ విధింపులపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ట్విట్టర్ ఖాతాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ పోయిన సంవత్సరం కూడా పీఎంఓ కేవలం నాలుగు గంటల నోటీసుతో లాక్‌డౌన్ విధించింది.

ఇది దేశంలోని పేదలపై తీవ్ర ప్రభావం చూపించింది. రాష్ట్ర అధికారాల మీద కేంద్రం కొత్త రకమైన ఆక్రమణలకు పాల్పడుతోంది’ అని ట్వీట్ చేశారు. ‘కోర్టులు విధాన పరమైన నిర్ణయాల్లో జోక్యం చేసుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలపై ఇది ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్ విధించడం వల్ల పేద ప్రజలకు ఆకలి, కొవిడ్ మధ్య ఏదీ ఎంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది’ అంటూ మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ సమయాన్ని రాత్రి 10 గంటల నుంచి ప్రారంభించాలని కోరారు. పాలు, ఇతర అవసరమైన ఆహార పదార్థాలను కూడా మినహాయింపునిచ్చే సర్వీసుల్లో చేర్చాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed