నిజామాబాద్‌ నుంచి ఢిల్లీ, ముంబైకి కనెక్టివిటీ ఇవ్వండి: ఎంపీ అర్వింద్

by Shyam |
నిజామాబాద్‌ నుంచి ఢిల్లీ, ముంబైకి కనెక్టివిటీ ఇవ్వండి: ఎంపీ అర్వింద్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ నుంచి ఢిల్లీ, ముంబై వరకు కనెక్టివిటీ కోసం దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాకు ఎంపీ అర్వింద్ విన్నవించారు. మంగళవారం ఢిల్లీలో దక్షిణ మధ్య రైల్వే పరిధి ఎంపీలతో రైల్ నిలయంలో జీఎం గజానన్ మాల్యా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ ధర్మపూరి అర్వింద్ ఉత్తర, దక్షిణ భారతదేశాలకు మధ్యగా ఉన్న నిజామాబాద్ నుంచి ఢిల్లీ, ముంబై మధ్య కనెక్టివిటీ ఇవ్వాలని కోరారు. ఢిల్లీ, ముంబైలో కొత్త టర్మినల్స్ నిర్మాణంలో ఉన్నాయని అవి పూర్తయిన వెంటనే తప్పకుండా ఏర్పాటు చేస్తామని అధికారులు హమీ ఇవ్వగా.. దానిని లిఖిత పూర్వకంగా ఇమ్మని కోరినట్లు అర్వింద్ తెలిపారు. ప్రస్తుతం నడుస్తున్న కరీంనగర్-తిరుపతి రైలును నియోజకవర్గంలోని జగిత్యాల, కోరుట్ల, ఆర్మూర్‌ల మీదుగా నిజామాబాద్ వరకు పొడిగించాలని చేసిన విజ్ఞప్తిపై జీఎం సానుకూలంగా స్పందించారన్నారు. దక్షిణ మధ్య రైల్వే ఈ ఫైల్‌ను రైల్వే బోర్డు అనుమతి కోసం పంపించడం జరిగిందన్నారు.

Advertisement

Next Story

Most Viewed