పసుపు పంటపై కేంద్ర మంత్రులకు ఎంపీ అర్వింద్ లేఖ..

by Shyam |
పసుపు పంటపై కేంద్ర మంత్రులకు ఎంపీ అర్వింద్ లేఖ..
X

దిశప్రతినిధి, నిజామాబాద్ : దేశంలో నాణ్యమైన పసుపు పంట పుష్కలంగా పండిందని దీంతో విదేశాల నుంచి ప్రతీ ఏడాది జరిగే పసుపు దిగుమతులు ఆపివేసి, ఎగుమతులను మరింత పెంచాలని కేంద్ర మంత్రులు అమిత్ షా, తోమర్, పీయూష్ గోయల్‌కు లేఖలు రాసినట్టు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ తెలిపారు. పసుపు రైతు భవిష్యత్తు కోసం 2020లో జరిగిన పార్లమెంట్ సెషన్‌లో పసుపు మద్దతు ధర పెంపు విషయాన్ని పార్లమెంట్ ద్రుష్టికి తీసుకు వెళ్లినట్లు గుర్తుచేశారు.

ప్రతీ ఏడాది కనీసం క్వింటాల్‌కు రూ.5 వేల నుంచి 7,700 వరకు ధర పలికేదని, కానీ ఇప్పుడు క్వింటాల్‌కు రూ.10 వేల వరకు పలుకుతుందన్నారు. దేశంలో 40 శాతం పసుపు సాగు విస్తీర్ణం పెరిగిందని, దీంతో ఇతర దేశాల నుంచి దిగుమతులను నిలిపివేసి నాణ్యమైన పసుపును ఎగుమతి దిశగా ప్రభుత్వం ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed