మీ షరతులు లేని ప్రేమ నన్ను అలా చేసింది.. Ravi Teja ఆసక్తికర ట్వీట్

by Sathputhe Rajesh |   ( Updated:2023-02-08 15:51:08.0  )
మీ షరతులు లేని ప్రేమ నన్ను అలా చేసింది.. Ravi Teja ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ధమాకా విజయంతో మంచి ఊపు మీదున్న రవితేజ 2023లో అంతా మంచి జరగాలని కాంక్షించారు. తన అభిమానులను ఉద్దేశించి ఆసక్తికర ట్వీట్ చేశారు. ధమాకా సినిమాను హిట్ చేసినందుకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. ధమాకా విజయాన్ని 2022లో కన్నుమూసిన అగ్రహీరోలకు అంకితం ఇస్తున్నానన్నాడు. 2022 చాలా కష్టంగా సాగిందని అయినా మీ షరతులు లేని ప్రేమ నన్ను ముందుకు సాగేలా చేసిందని తెలిపాడు. కాగా డిసెంబర్ 23న విడుదలైన ధమాకా సినిమా హిట్‌తో రవితేజ 2022ను గ్రాండ్‌గా ముగించాడు. సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ.77 కోట్లు రాబట్టి విజయపథంలో ధమాకా దూసుకెళ్తోంది. సినిమా హిట్ కావడంతో రవితేజ ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. 2023లో సంక్రాంతికి రానున్న మెగాస్టార్ వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజ కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story