Varun Sandesh met with an accident: యంగ్ హీరో వరుణ్ సందేశ్‌కు ప్రమాదం

by Satheesh |   ( Updated:2023-06-22 05:59:17.0  )
Varun Sandesh met with an accident: యంగ్ హీరో వరుణ్ సందేశ్‌కు ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరో వరణ్ సందేశ్ ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ ‘ది కానిస్టేబుల్’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. కాగా, ఈ చిత్ర షూటింగ్‌లో భాగంగా బుధవారం యాక్షన్స్ సీన్స్ చిత్రీకరిస్తుండగా వరుణ్ సందేశ్‌కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో వెంటనే అప్రమత్తమైన మూవీ యూనిట్ హుటాహుటిన వరుణ్ సందేశ్‌ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ తెలియాల్సి ఉంది. తమ అభిమాన నటుడికి ప్రమాదం జరిగిందని తెలియడంతో వరుణ్ సందేశ్ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, టాలీవుడ్‌లో హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం వంటి హిట్ చిత్రాల్లో నటించి వరుణ్ సందేశ్ హీరోగా మంచి గుర్తింపు పొందాడు.

Read More... మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఫోన్ వాల్‌పేపర్ ఏం పెట్టుకుందో తెలుసా?

Advertisement

Next Story