మల్టీ టాలెంటెడ్.. నిహారికపై యంగ్ హీరో కామెంట్స్ వైరల్

by sudharani |
మల్టీ టాలెంటెడ్.. నిహారికపై యంగ్ హీరో కామెంట్స్ వైరల్
X

దిశ, సినిమా: మెగా వారసురాలు నిహారిక కొణిదెల సమర్పణలో వస్తున్న తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్. పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహిస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో ఫ్రెండ్ షిప్, లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైన్‌గా రూపొందిన ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైనా టీజర్, లిరికల్ సాంగ్స్‌కు మంచి స్పందన లభించింది. తాజాగా ట్రైలర్‌ను యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాడ్లాడుతూ.. ‘నన్ను ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగమయ్యేలా చేసిన నిహారికకు థాంక్స్. ఈ మూవీలో విజువల్స్ చాలా బాగున్నాయి. ఇలా కొత్త వారితో ఇంత మంచిగా చిత్రాన్ని తీయడం అంటే మామూలు విషయం కాదు. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ ఆల్ ది బెస్ట్. నిహారిక మల్టీ టాలెంటెడ్. నటిస్తున్నారు.. నిర్మిస్తున్నారు.. షోలు చేస్తున్నారు. ఆమెకు ఈ చిత్రం పెద్ద హిట్ అయి భారీ లాభాల్ని తెచ్చి పెట్టాలి. ఇలాంటి మంచి చిత్రాలు వస్తే ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు.. పెద్ద హిట్ చేస్తారు’ అని చెప్పుకొచ్చాడు.



Next Story