మీరే నిజమైన గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్

by sudharani |
మీరే నిజమైన గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమాల్లో ‘గేమ్ ఛేంజర్’ ఒకటి. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడూ లేట్ అవుతున్నాయి. దీనికి కారణం శంకర్ ‘ఇండియన్-2’ చిత్రాన్ని కూడా తెరకెక్కించే పనిలో ఉన్నారు. అయితే.. రామ్ చరణ్ తాజాగా ఓ ట్వీట్ షేర్ చేశారు.

డైరెక్టర్ శంకర్ బర్త్‌డే సందర్భంగా.. ‘‘ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మీరు నిజమైన గేమ్ ఛేంజర్. మీ కెరీర్ అద్భుతమైన 30 ఏళ్లు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు. మీ నుంచి మరిన్ని ఆదర్శవంతమైన పని కోసం ఎదురు చూస్తున్నాం’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా.. శంకర్ బర్త్‌డే సందర్భంగా ఇండియన్-2, గేమ్ ఛేంజర్ సినిమాల యూనిట్ సభ్యులు వేడుకలు నిర్వహించారు. ఈ సెలబ్రేషన్స్‌కు పాల్గొన్న దర్శకుడు శంకర్ కేక్ కట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed