Naga chaithanya: సమంత, శోభిత కంటే ముందు చైతన్య ఎంతమంది హీరోయిన్స్‌తో అఫైర్స్ నడిపాడో తెలిస్తే షాకే..? మామూలోడు కాదుగా

by Kavitha |   ( Updated:2024-08-15 15:52:13.0  )
Naga chaithanya: సమంత, శోభిత కంటే ముందు చైతన్య ఎంతమంది హీరోయిన్స్‌తో అఫైర్స్ నడిపాడో తెలిస్తే షాకే..? మామూలోడు కాదుగా
X

దిశ, సినిమా: అక్కినేని హీరో నాగచైతన్య గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పని లేదు. ‘జోష్’ మూవీతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఇతను.. తర్వాత ‘ఏమాయ చేసావే’ మూవీతో ఫుల్ ఫేమస్ అయ్యాడు. అలా ఆ సినిమాలో కో యాక్టర్‌గా నటించిన స్టార్ హీరోయిన్ సమంతతో ప్రేమలో పడి పెళ్లి కూడా చేసుకున్నాడు. కానీ మ్యారేజ్ అయిన నాలుగేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఇక సమంతతో డివోర్స్ తర్వాత స్టార్ హీరోయిన్ శోభిత ధూళిపాళతో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు కోడై కూసాయి. అంతే కాకుండా వీరిద్దరు కలిసి ఓకే దగ్గర ఉన్న ఫొటోలు కూడా మీడియాకు చిక్కాయి. కానీ, వాటిపై వీరిద్దరు ఏనాడు స్పందించలేదు. అలానూ కొట్టిపారేయనూ లేదు. ఇక ఇలా వచ్చిన పుకార్లలను నిజం చేస్తూ ఆగస్టు 8 న చైతన్య శోభిత ధూళిపాళతో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా అక్కినేని నాగార్జున X వేదికగా ప్రకటించాడు. కాగా ప్రస్తుతం నాగ చైతన్య ‘తండేల్’ మూవీతో మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఇదిలా ఉంటే.. చూసేందుకు ఎంతో అమాయకంగా, రాముడు మంచి బాలుడు లాగా కనిపించే నాగ చైతన్య.. వాస్తవానికి ఆయన ఒక కృష్ణుడు అని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ఎప్పటి నుండో వినిపిస్తున్న వార్త. చైతన్య అమాయకమైన ముఖాన్ని చూసి ఏ అమ్మాయి అయినా పడిపోవాల్సిందే నట. సమంత ,శోభిత విషయాల్లో కూడా అదే జరిగింది. వీరిద్దరి కంటే ముందు నాగ చైతన్య అప్పుడే ఇండస్ట్రీ‌లోకి వచ్చిన యంగ్ హీరోయిన్‌తో కొన్నాళ్ళు డేటింగ్ చేసి బైక్ రైడింగ్స్‌కి కూడా వెళ్లేవారట. ఆ తర్వాత ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ మోస్ట్ స్టార్‌గా కొనసాగుతున్న ఒక హీరోయిన్‌తో కూడా ఆయన ప్రేమాయణం నడిపినట్టు తెలుస్తుంది. అలాగే బంగార్రాజు చిత్రం‌లో చిన్న రోల్‌లో తళుక్కుమని మెరిసిన దీక్షాతో కూడా నాగ చైతన్య కొద్ది రోజులు డేటింగ్ చేసాడట. అలా అమాయకమైన చూపులతో నాగ చైతన్య ఇంతమంది హీరోయిన్స్‌తో అఫైర్స్ నడిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed