- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
పారిస్ అల్లర్లలో చిక్కుకున్న ఊర్వశి.. భయంగా ఉందంటూ ఎమోషనల్
దిశ, సినిమా : బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఫ్రాన్స్‌లో ఉన్న తన టీమ్ భద్రత గురించి ఆందోళన చెందుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ‘పారిస్ ఫ్యాషన్ వీక్ 2023’లో పాల్గొనడానికి తన సిబ్బందితో కలిసి పారిస్ వెళ్లిన నటి.. అక్కడ నెలకొన్న అల్లర్లు తమను భయాందోళనకు గురిచేస్తున్నాయని చెప్పింది. అలాగే భారతదేశంలో ఉన్న తమ కుటుంబాలు కూడా తమ సెఫ్టీ గురించి కంగారు పడుతున్నాయని చెప్పింది.
‘ఇక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి ప్రతిరోజు మా వాళ్లు వార్తలు చదువుతున్నారు. దీంతో టెన్సన్ పడుతూ మాకు కాల్స్ చేస్తున్నారు. అయితే మేము మమ్మల్ని సురక్షితంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. నిజంగా ఈ పరిస్థితి మమ్మల్ని కలచివేసింది’ అని చెప్పింది. ఇక ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేశాడనే కారణంగా 17 ఏళ్ల యువకుడిని ఫ్రాన్స్ పోలీసులు కాల్చి చంపడంతో ప్రజలు పెద్ద ఎత్తున్న రోడ్లపై నిరసనలు తెలుపుతున్నారు.