అన్నయ అని పెళ్లి చేసుకుంటావా? అంటూ బాలీవుడ్ నటిపై ట్రోలింగ్

by Hamsa |   ( Updated:2023-02-18 06:45:23.0  )
అన్నయ అని పెళ్లి చేసుకుంటావా? అంటూ బాలీవుడ్ నటిపై ట్రోలింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటి స్వర భాస్కర్ నిత్యం తన సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అనేక విషయాలపై స్పందిస్తుంది. తన ఫ్రెండ్, సమాజ్ వాదీ పార్టీ నేత అహ్మద్ ఫవాద్‌ను సీక్రెట్‌గా జనవరి 6న పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 16న తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఈ విషయాన్ని పంచుకుంది. అది చూసిన నెటిజన్లు స్వర భాస్కర్‌పై ట్రోలింగ్ మెదలుపెట్టారు.

అన్నయ్య అని పిలిచిన వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకున్నావంటూ? ట్రోల్ చేస్తున్నారు. ఇక 2020లో ఎస్పీ తరపున ప్రచారం నిర్వహించనప్పుడు ఫహాద్‌ను స్వర భాస్కర్ అన్నయ్య అని పిలిచేదట. అంతేకాకుండా అతడి పుట్టిన రోజున 'భాయ్' అని ట్విట్టర్‌లో విషెస్ తెలిపింది. దీంతో నెటిజన్లు వాటిని గుర్తు చేస్తూ మరీ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

Advertisement

Next Story