చైతూ లైఫ్‌లో సమంత స్థానాన్ని ఆ హీరోయిన్ రీప్లేస్ చేయనుందా?

by Jakkula Samataha |   ( Updated:2024-02-05 12:29:16.0  )
చైతూ లైఫ్‌లో సమంత స్థానాన్ని ఆ హీరోయిన్ రీప్లేస్ చేయనుందా?
X

దిశ, సినిమా : టాలీవుడ్ లవ్‌లీ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే. ఏమాయ చేశావే సినిమాతో తెలుగు వెండితెరకు పరిచమయైన ఈ ముద్దుగుమ్మ, అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకొని విడిపోయిన విషయం తెలిసిందే. ఇక ఎవర్ గ్రీన్‌గా ఉండే ఈ కపుల్ విడిపోవడం చిత్రపరిశ్రమనే షాక్‌కు గురిచేసింది. ఫ్యాన్స్‌ ఆ ఇష్యూ నుంచి ఇప్పటికీ కోలుకోలేదు అనడంలో అతిశయోక్తి లేదు. నాగచైతన్య పక్కన సమంత ఉంటనే చూడటానికి బాగుంటుంది, చైతన్య లైఫ్‌లో సామ్ ప్లేస్ ఎవరూ రీప్లేస్ చేయలేరని సమంత ఫ్యాన్స్ అంటుంటారు.

కాగా, నాగచైతన్య లైఫ్‌లో సమంత ప్లేస్‌ను రీప్లేస్ చేసే హీరోయిన్ దొరికేసింది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ మధ్యకాలంలో చైతూ మూవీస్ ఎక్కువగా హిట్ కావడం లేదు. గతంలో సమంత, చైతూ కలిసి ఏ సినిమా చేసినా అది మంచి హిట్ అయ్యేది. అయితే ప్రస్తుతం నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో వచ్చినా ఏ సినిమా అయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా మంచి హిట్ అవుతాయి. ఒకప్పుడు సమంత నాగచైతన్య నటించినప్పుడు వచ్చిన క్రేజ్ పబ్లిసిటీ పాపులారిటీ ఇప్పుడు నాగచైతన్య ,సాయి పల్లవి నటించిన సినిమాలకు వస్తుంది . దీంతో సామ్ స్థాన్ని సాయిపల్లవి రీప్లేస్ చేసింది అంటూ ఓ న్యూస్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Next Story