Ex-Minister: తెలంగాణకు రావాల్సిన ఆ మూడు ఏపీ ఆపింది.. మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్

by Gantepaka Srikanth |   ( Updated:2024-12-27 15:57:56.0  )
Ex-Minister: తెలంగాణకు రావాల్సిన ఆ మూడు ఏపీ ఆపింది.. మాజీ మంత్రి షాకింగ్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు(Palamuru-Rangareddy project) ద్వారా నీళ్లు వచ్చే పరిస్థితి లేదని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది బీఆర్ఎస్(BRS) నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) ఆరోపించారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. పాలమూరు-రంగారెడ్డి ద్వారా 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు ఇవ్వడం లేదని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే పాలమూరు-రంగారెడ్డి ట్రయల్ రన్ పూర్తి అయిందని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డిపై కృష్ణా ట్రిబ్యునల్‌(Krishna Tribunal)కు ఫిర్యాదు చేసిందని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి అని.. పాలమూరు పేరు చెప్పుకుని డబ్బులు తెచ్చుకుని జిల్లాను ఎండబెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. పాలమూరు జిల్లా నుండి 14 లక్షల మంది వలసలు వెళ్లారని వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో పంపిన డీపీఆర్‌కు పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చింది. నాగార్జున సాగర్(Nagarjuna Sagar) ఎగువున ఉన్న 45 టీఎంసీలు తెలంగాణ వాడుకోవాలని తీర్పు ఉంది. 90 టీఎంసీల నికర జలాలు తెలంగాణకు ఉన్నాయి. అయినా కృష్ణా ట్రిబ్యునల్‌లో ఏపీ ప్రభుత్వం తప్పుడు ఫిర్యాదులు చేసిందని మండిపడ్డారు. కుట్రపూరితంగానే తెలంగాణకు రావాల్సిన మూడు అనుమతులను ఏపీ ప్రభుత్వం(AP Govt) ఆపిందని ఫైర్ అయ్యారు. పాలమూరు-రంగారెడ్డి పూర్తి అయితే జిల్లా సస్యశ్యామలం అవుతుందని అన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు(Chandrababu) సీఎంగా ఉండి పాలమూరు జిల్లాను దత్తత తీసుకుని ఏం చేయలేదని తెలిపారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు సమన్వయంతో ఉండాలని అభిప్రాయపడ్డారు. ప్రధాని మోడీ(PM Modi) పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని అన్నారని గుర్తుచేశారు. శ్రీశైలం ప్రాజెక్టుపై పెత్తనం చేయాలని ఏపీ ప్రభుత్వం చూస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో చెప్పాలని ప్రభుత్వాన్ని శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వంతో మాట్లాడి సమస్యలు పరిష్కరించుకోవాలని హితవు పలికారు. పాలమూరు-రంగారెడ్డిపై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకువెళ్లాలని సూచించారు.


Read More..

PhD student: పీహెచ్‌డీ విద్యార్థిని ఆత్మహత్య.. ముగ్గురు నిందితుల అరెస్ట్

Advertisement

Next Story

Most Viewed