నటుడు చందు-పవిత్ర రిలేషన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన భార్య శిల్ప.. చంద్ర కాంత్ నా భర్త నువ్వు మర్చిపో అంటూ బెదిరించేది..

by Kavitha |
నటుడు చందు-పవిత్ర రిలేషన్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన భార్య శిల్ప.. చంద్ర కాంత్ నా భర్త నువ్వు మర్చిపో అంటూ బెదిరించేది..
X

దిశ, సినిమా: 'త్రినయిని'తో సీరియల్‌లో నటించిన చందు మన అందరికి సుపరిచితమే. ప్రస్తుతం చందు రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం వంటి సీరియల్స్‌లో కూడా నటిస్తున్నారు. కాగా 2015లో శిల్ప అనే ఆమెను చందు ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా వారికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.

ఇటీవల రోడ్ యాక్సిడెంట్‌లో 'త్రినయని' సీరియల్‌ ఆర్టిస్ట్ పవిత్ర జయరాం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణ వార్త మరవకముందే అదే సీరియల్‌కు చెందిన మరో నటుడు చందు ఆత్మహత్య చేసుకోవడం తెలుగు బుల్లితెర ఇండస్ట్రీలో మరోసారి తీవ్ర విషాదాన్ని నింపింది. శుక్రవారం హైదరాబాద్, మణికొండలోని తన నివాసంలో చందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఆత్మహత్యకు వివాహేతర సంబంధమే కారణం అనేలా వార్తలు వినబడుతున్నాయి.

ఇదిలా ఉండగా తాజాగా చంద్రకాంత్ భార్య మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. చంద్రకాంత్ భార్య శిల్ప మాట్లాడుతూ.. 'మేం ఇద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. కొత్తలో ఆయన ఎంతో ఇష్టంగా నన్ను చూసుకున్నాడు. తనకు త్రినయని సీరియల్ లో ఛాన్స్ వచ్చింది ఆ సమయంలోనే పవిత్ర జయరాంతో సంబంధం ఏర్పడింది. అప్పటి నుంచి నన్ను కొట్టడం, తిట్టడం చిత్రహింసలకు గురి చేయడం, సోషల్ మాద్యమాల్లో నన్ను బ్లాక్ చేయడం చేశారు. ఇక పవిత్ర జయరాం నాకు ఫోన్ చేసి చంద్ర కాంత్ నా భర్త నువ్వు మర్చిపో.. అంటూ బెదిరించేది. ఒకసారి నేను ఆమె కొడుకును కలిసి విషయం చెప్పగా వాళ్ల లైఫ్ వాళ్ల ఇష్టం.. మాకు దానితో సంబంధం లేదని సమాధానం చెప్పాడు. ఇంట్లో ఉంటే ఎప్పుడూ ఆమెతో ఫోన్ లో వీడియో కాల్ చేస్తూ 'చెప్పవే పాప.. ఏం చేస్తున్నా.. నన్ను మిస్ అవుతున్నావా' అంటూ మాట్లాడేవాడు. నా గురించి అందరికీ నెగిటివ్ చెబుతూ నన్ను బ్లేమ్ చేసేవాడు. అయితే పవిత్రకు రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బెడ్ పై పడుకొని ట్రీట్మెంట్ తీసుకుంటూ మా ముందే పవిత్ర గురించి ఏడ్చుకుంటూ ఆమెనే తల్చుకున్నాడు. ఇన్నాళ్లు తను అర్థం చేసుకుంటాడన్న నమ్మకంతో బతికాను.. ఇప్పుడు ఆ నమ్మకం కూడా పోయింది.. పవిత్ర కోసం నా జీవితం మొత్తం నాశనం చేశాడు' అంటూ శిల్ప ఎమోషన్ అయ్యింది.

Advertisement

Next Story

Most Viewed