ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోతే Nagarjuna ఎందుకు వెళ్లరు?

by samatah |   ( Updated:2022-12-25 03:52:19.0  )
ఇండస్ట్రీలో ఎవరైనా చనిపోతే Nagarjuna ఎందుకు వెళ్లరు?
X

దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్‌లో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ దిగ్గజ నటులు కన్నుమూశారు. ఈ క్రమంలో నాగార్జునకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో తెగ హల్‌చల్ అవుతోంది. ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎంత పెద్ద సెలబ్రిటీ చనిపోయినా కూడా, కనీసం వారి చివరి చూపు చూడటానికి కూడా నాగార్జున వెల్లడం లేదు. కనీసం బాధిత కుటుంబాలను సైతం పరామర్శించరు. దీంతో నాగార్జునపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వర రావు చనిపోయినప్పుడు, సీనియర్ నటులు అందరూ తమ ఇంటికి వెళ్లి నాగార్జునను పరామర్శించారు. కానీ ఇటీవలన సీనియర్ నటుడు కృష్ణా, కృష్ణంరాజు, కైకాల సత్యనారాయణ చనిపోయినప్పుడు వారి చివరి చూపు కూడా చూడటానికి వెళ్లలేదు. దీంతో నాగార్జునపై నెటిజన్లు తీవ్రంగా మండి పడుతున్నారు. ఫంక్షన్లు జరుపుకుంటే ఫ్యామిలీతో వెళ్తావు కానీ చనిపోతే వెళ్లి పరామర్శించవా? అంటూ పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. అలాగే అసలు నాగార్జున చనిపోయిన వారి చివరి చూపుకోసం ఎందుకు వెళ్లడు, ఏదైనా బలమైన కారణాలు ఉన్నాయా? అని కొందరు చర్చిస్తున్నారు. ఇక దీనిపై అక్కినేని హీరో స్పందిస్తే కానీ ఎలాంటి క్లారిటీ వచ్చేలా లేదు.

Also Read..

'చీరకు నిప్పంటుకొని చలపతి రావు భార్య మృతి'

Advertisement

Next Story