Minister Ponnam : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి కుల వృత్తులు మారాలి

by Kalyani |
Minister Ponnam : మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి కుల వృత్తులు మారాలి
X

దిశ, కోహెడ : గంగపుత్రులు ఆర్థికంగా ఎదగడానికి కుల వృత్తి ఎంతో దోహదపడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ( Minister Ponnam Prabhakar ) అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం ప్రాజెక్టులో చేప పిల్లలను వదిలిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి( Collector Mikkilineni Manuchoudhary ) తో కలిసి పూజలు చేసి చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం బలహీన వర్గాలకు మరింత న్యాయం చేయాలని, ఆర్థికంగా ఎదగాలని చేప పిల్లల పంపిణీ గతానికి మించి చేస్తున్నామని అన్నారు. గతంలో చేప పిల్లల పంపిణీ చేయడానికి పాత పేమెంట్ కొంత ఇబ్బంది పడ్డారు.. అవి క్లియర్ చేసి 100 శాతం రాయితీపై ఉచిత చేప పిల్లలు ఇవ్వడం జరుగుతుందన్నారు.

సిద్దిపేట జిల్లాలో మత్స్య సహకార సంఘాలు ఉన్నవాటికి పరిమితం కాకుండా నీటి నిల్వలు ఉన్న దగ్గర కూడా చేప పిల్లలు వేయాలని కలెక్టర్ ను కోరారు. “ హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రతి చెరువులో చేప పిల్లలు వెయ్యాలని వేసుకునే బాధ్యత మీదే..మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి కుల వృత్తులు మారాలి..మత్స్య శాఖ కు సంబంధించి మొబైల్ మార్కెట్ లు అమ్ముకోవడానికి మౌలిక వసతులు తదితర వాటిపై చర్యలు తీసుకుంటాం. శనిగరం దగ్గర ప్రభుత్వ స్థలంలో ఫిష్ మార్కెట్ పెడతాం..” ఆర్డీవో స్థల సేకరణ చేయాలని అన్నారు. “ హైదరాబాద్ కి పోయే వారు ఇక్కడ చేపలు కొనుక్కొని పోయేలా అభివృద్ధి జరగాలి.శనిగరం గెస్ట్ హౌజ్ పునరుద్ధరణ చేస్తాం.. ఇక్కడ టూరిజం అభివృద్ధి చేస్తాం..ఫిష్ పాండ్ ను పునరుద్ధరణ చేయాలి. దానిని ఆక్టివ్ చేయాలి. మత్స్య సంపద,పశు పోషణ పాలు,కోళ్ళు పై ఎక్కువ దృష్టి సారించాలి.

ఆయిల్ ఫాం,డ్రాగన్ ఫ్రూట్ ,చేపల చెరువు ,కోళ్ళు పెంపకం ,ఆవులు గేదెల పెంపకం పై రైతు వేదికల వద్ద అవగాహన కల్పిస్తున్నాం. బ్యాంకర్ల తో కూడా మీటింగ్ లు పెట్టి లోన్లకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం..” అని అన్నారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ద్వారా కుల వృత్తుల ద్వారా మోడీపీకేషన్ ట్రైనింగ్ ఇచ్చి మారుతున్న కాలానికి అనుగుణంగా మారేలా శిక్షణ ఇస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్య శాఖ అడిషనల్ డెరైక్టర్ , సిద్దిపేట ఫిషరీస్ అధికారులు, ఈఎన్సీ, సిద్ధిపేట గ్రంథాలయ చైర్మన్ లింగమూర్తి ,ఆర్డీవో, నియోజకవర్గ ముఖ్య నేతలు, అధికారులు,సిద్దిపేట కాంగ్రెస్ ఇంచార్జి పూజల హరికృష్ణ, శంకర్ రాథోడ్, నియోజకవర్గ ముఖ్య నేతలు, అధికారులు మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, మండల్ నాయకులు కర్ర రవీందర్,పాము శ్రీకాంత్,బోయిని జయరాజ్, శెట్టి సుధాకర్, భీమ్ రెడ్డి తిరుపతిరెడ్డి, చింతకింది శంకర్, అబ్దుల్ రఫీ, ముదిరాజ్ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed