- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Periods: పీరియడ్స్ సమయంలో కూల్ డ్రింక్స్ తాగుతున్నారా? తాజా అధ్యయనం ఏం చెబుతోంది?

దిశ, వెబ్‌డెస్క్: ప్రతి మహిళ ఎదుర్కొనే సమస్యల్లో పీరియడ్స్(Periods) ఒకటి. ప్రతి నెల ఆడపిల్లలు ఈ సమస్యను ఫేస్ చేస్తుంటారు. ఆడవాళ్లలో జరిగే ఈ బుుతుస్రావం(menstruation) అనేది సహజమైన జీవ ప్రక్రయ ఇది సాధారణంగా నెలకు ఒకసారి జరుగుతుంది. ఈ సమయంలో చాలా మంది ఆడవాళ్లకు తవ్రంగా కాళ్ల నొప్పి, పొట్ట నొప్పి(Stomach ache) వస్తుంది. కొంతమంది మహిళల్లో తిమ్మిరి వంటి సమస్యలు కూడా కనిపిస్తాయి. ఈ చిన్న చిన్న లక్షణాలే సమ్ టైమ్స్ తీవ్రంగా మారే అవకాశం ఉంటుంది. కాగా పీరియడ్స్ టైంలో పలు రకాల ఫుడ్స్(Foods) కు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే డార్క్ చాక్లెట్స్(Dark chocolates) తింటే కాస్త రిలీఫ్ గా ఉంటుందంటున్నారు.
స్పైసీ ఫుడ్స్ అండ్ కూల్ డ్రింక్స్‌కు దూరంగా ఉండండి..
కానీ ఎట్టిపరిస్థితుల్లోనూ స్పైసీ ఫుడ్స్(Spicy foods) అండ్ కూల్ డ్రింక్స్(Cool drinks) తీసుకోకూడదని తాజాగా నిపుణులు హెచ్చరిస్తున్నారు. పీరియడ్స్ సమయంలో కూల్ డ్రింక్స్ తాగితే.. స్టమక్ పెయిన్ మరింత అధికం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. శీతల పానీయాలు ఎవరూ ఎక్కువగా తాగుతారో వారిలో స్టమక్ పెయిన్(Stomach pain) 24 శాతం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. ప్రతి నెల పీరియడ్స్ సమయంలో కూల్ డ్రింక్స్ తాగితే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. వీటిలో అదనపు చక్కెర(Extra sugar) ఉంటుంది. కాగా బాడీలో ఇన్ఫ్లమేషన్(Inflammation) ను పెంచే అవకాశాలు భారీగా ఉన్నాయి. అలాగే షుగర్ లెవల్స్(Sugar levels) పెరుగుతాయి. ఇన్సులిన్ స్థాయిలు అనుకోకుండా ఒకేసారి పెరగడం వల్ల కడుపు నొప్పి బాగా వస్తుంది.
మూత్ర విసర్జనపై ఎఫెక్ట్ చూపుతోన్న శీతల పానీయాలు..
అలాగే కూల్ డ్రింక్స్ లో కెఫిన్(Caffeine) పుష్కలంగా ఉంటుంది. తలనొప్పి(headache) నుంచి ఉపశమనం పొందవచ్చు కానీ తర్వాత రక్తనాళాలను కుదించుకుపోయేలా చేస్తుంది. స్ట్రెస్(Stress) ను పెంచుతుంది. అలాగే పొత్తికడుపులో ఉబ్బరం, అసౌకర్యం వంటివి తలెత్తుతాయి. కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం వల్ల బాడీలో డిహైడ్రేషన్(Dehydration) ప్రాబ్లమ్ రావచ్చు. అలాగే మూత్ర విసర్జనపై ఎఫెక్ట్ చూపుతుంది. మూత్ర ఉత్పత్తినిపెంచి బాడీ నుంచి ఎక్కువ స్థాయిలో వాటర్ బయటకు వెళ్లేలా చేస్తుంది. దీంతో గర్భాశయంలో కండరాలు నొప్పికి గురవుతాయి. కాగా పీరియడ్స్ సమయంలో వీలైనంత వరకు కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండటమే ఆరోగ్యానికి మేలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.