- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA : మత్స్యకారుల అభివృద్ధియే ప్రజా ప్రభుత్వ ధ్యేయం.. ఎమ్మెల్యే
దిశ, తొర్రూరు : మత్స్యకారుల అభివృద్ధియే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా, తొర్రూరు మండలం, హరిపిరాల గ్రామంలోని పెద్దచెరువులో, శనివారం మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా మత్స్యశాఖ అధికారులతో కలిసి ఒక లక్ష ఇరవై ఐదు వేల చేప పిల్లల పంపిణీలో పాలకుర్తి నియోజకవర్గ శాసన సభ్యురాలు యశశ్విని ఝాన్సీ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధే ద్యేయంగా చేప పిల్లలు పంపిణీ చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలో అన్ని మండలాల్లో చేప పిల్లలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చేపల ఉత్పత్తి గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని సూచించారు.
ఈ కార్యక్రమంలో తొర్రూరు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, బ్లాక్ అధ్యక్షులు హమ్యా నాయక్, మండల పార్టీ అధ్యక్షులు సంచు సంతోష్, సీనియర్ నాయకులు కేతిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంజి విజయపాల్ రెడ్డి, రామసహాయం కిషోర్ రెడ్డి, వెంకట్ నారాయణ, నరేంద్ర రెడ్డి, తొర్రూరు పట్టణ అధ్యక్షులు సోమ రాజశేఖర్, గ్రామపార్టీ అధ్యక్షులు అశోక్ , మాజీ మండల అధ్యక్షులు సాధకర్, కిషన్ రెడ్డి, కిషన్ సెల్ కందాడి అశోక్ రెడ్డి, ధారావత్ సోమన్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, మత్స్యశాఖ అధికారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.