Bike rally : అమరులను స్మరిస్తూ బైక్ ర్యాలీ..

by Sumithra |
Bike rally : అమరులను స్మరిస్తూ బైక్ ర్యాలీ..
X

దిశ, నల్లగొండ : అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా జిల్లా పోలీస్ కార్యలయంలోని అమరవీరుల స్థూపం వద్ద నుండి ప్రారంభమై క్లాక్ టవర్, గుండెగోని మైసయ్య గౌడ్ విగ్రహం, ప్రకాశం బజార్, వయా డీఈఓ ఆఫీస్ నుంచి క్లాక్ టవర్ వరకు పోలీసు సిబ్బంది, పట్టణ యువకులతో బైక్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలు చేసుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21 ప్లాగ్ డే నిర్వహిస్తున్నామన్నారు. వారి త్యాగాలకు గుర్తుగా అమరవీరుల వారోత్సవాలు జరుపుకుంటున్నామని, దీనిలో భాగంగా ఈ రోజు పట్టణ కేంద్రంలో ఎందరో అమరుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ బైక్ ర్యాలీ నిర్వహించారన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో విధి నిర్వహణ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా అమరులైన వారి ఆత్మశాంతి కలగాలని అన్నారు.

జిల్లా పోలీస్ ప్రజా సంక్షేమం కొరకు శాంతి భద్రతల పరిరక్షణలో నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. అలాగే ర్యాలీ సందర్భంగా ప్రతి ద్విచక్ర వాహనదారుడు తన స్వీయ కొరకు హెల్మెట్ తప్పక ధరించాలని, వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో అధికంగా తలకు గాయం కావడం వలన వాహనదారులు మరణిస్తున్నారని, ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించి వాహనం నడపాలని ఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రామలు నాయక్, ఎస్బి డీఎస్పీ రమేష్, నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి, ఏఆర్ డీఎస్పి శ్రీనివాసులు, సీఐలు రాఘవరావు, రాజశేఖర్ రెడ్డి, డానియల్, సైదులు, నాగరాజు, కొండల్ రెడ్డి, ఆర్ ఐ లు సంతోష్, శ్రీను, సూరప్ప నాయుడు, ఎస్సైలు మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed