Accident: ఆర్మీ వాహనం బోల్తా.. ఓ సైనికుడు మృతి

by vinod kumar |
Accident: ఆర్మీ వాహనం బోల్తా.. ఓ సైనికుడు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లో ఆర్మీ వాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ సైనికుడు ప్రాణాలు కోల్పోగా.. మరో 13 మంది జవాన్లు గాయపడ్డారు. కుల్గామ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. చినార్ కార్ప్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం తెల్లవారుజామున ఓ ఆపరేషన్ ముగిసిన అనంతరం జవాన్లు తిరిగి వెళ్తుండగా కుల్గామ్ జిల్లాలోని డిచ్ పోరా ప్రాంతంలో సైనికులు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ సైనికుడు మరణించగా.. మరో 13 మంది క్షతగాత్రులయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన సైనికుడిని జీత్ లాల్‌గా గుర్తించారు. కాగా, అంతకుముందు ఈ నెల 24న బారాముల్లాలోని గుల్‌మార్గ్‌లో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు సైనికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story