MLA Vemula Veeresham : కోమటిరెడ్డి అభిమానులు తలచుకుంటే జిల్లాలో అడుగు పెట్టలేరు..

by Aamani |   ( Updated:2024-10-26 11:34:26.0  )
MLA Vemula Veeresham : కోమటిరెడ్డి అభిమానులు తలచుకుంటే జిల్లాలో అడుగు పెట్టలేరు..
X

దిశ,నార్కట్ పల్లి : నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అనుచరులు తలచుకుంటే సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ జిల్లాలో అడుగుపెట్టలేరని ఎమ్మెల్యే వేముల వీరేశంMLA Vemula Veeresham )హెచ్చరించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ఆపదలో ఆదుకునే వ్యక్తి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు. వెంటనే గాదరి కిషోర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నార్కట్ పల్లి మండల పరిధిలోని బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేసి కృష్ణ జలాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఈ విధంగా మాట్లాడారు. అధికారం పోయిందనే అక్కసుతోనే టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే బిక్కేరు వాగుపై చేయని పనులకు బిల్లులు తీసుకున్నడని త్వరలోనే ఆధారాలతో సహా బయట పెడతామన్నారు. రామన్నపేట మండలంలో అంబుజ సిమెంట్ కంపెనీకి భూములు ఇప్పించింది అప్పటి బీఆర్ఎస్ పార్టీ నాయకులని తెలిపారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ అఖిలపక్షం నుంచి తప్పుకొని ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారో తెలపాలి అన్నారు. నకిరేకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ శకం నడుస్తుందని ఇక్కడ కొంతమందికి స్థానం లేదని పాతాళంలోకి కూరుకుపోయిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇప్పటికే ప్రజలు తగిన బుద్ధి చెప్పిన విషయాన్ని పునరుద్ఘాటించారు.

గతంలో ఈ నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ చేసిన అభివృద్ధి పై బహిరంగ చర్చకు వచ్చేందుకు సిద్ధమా అంటూ సవాల్ చేశారు. అభివృద్ధిపై దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. తెల్ల బట్టలు వేసుకోకుండా బయటకు వెళ్తే మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టారన్నారు. అదే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రెండు రాష్ట్రాల్లో ఎక్కడికి వెళ్లినా ఆయనను గుర్తిస్తారు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు. ఎంతో చరిష్మా కలిగిన నాయకుడు పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారికి తగిన బుద్ధి చెబుతామన్నారు. అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు.

ఈ బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు (Brahmin Vellamla Project )కోమటిరెడ్డి వెంకటరెడ్డి కళ అని అదేవిధంగా ఇక్కడి రైతుల కలను నెరవేర్చిన మహా నాయకుడు అని కొనియాడారు. మొదటగా ఈ ప్రాజెక్టులో 60 శాతం నీటిని నింపి 50 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. నీటిని విడుదల చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గతంలో ఈ ప్రాజెక్టుపై నీటిని విడుదల చేయకుండా ఆలస్యం చేసిన వారు మళ్లీ దీనిపై కుట్రలు చేస్తున్నారన్నారు. ఇక్కడ అడ్డుకునేందుకు వస్తే వారికి ఇక్కడి రైతులే బుద్ధి చెబుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు భక్తుల ఉషయ్య గౌడ్, మాజీ జడ్పీటీసీ సభ్యులు దూదిమెట్ల సత్తయ్య, మాజీ ఎంపీపీ పబ్బతి రెడ్డి వెంకట్ రెడ్డి, నాయకులు వడ్డే భూపాల్ రెడ్డి, జేరిపోతుల భరత్, సట్టు సత్తయ్య, ఎల్లందుల కిట్టు, గడుసు శశిధర్ రెడ్డి, రాధారపు బిక్షపతి, ఇడికుల్ల సంపత్, తదితర నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story