Sandeep Kishan: యంగ్ బ్యూటీతో కలిసి షాకిచ్చిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. వీడియో వైరల్

by Hamsa |   ( Updated:2024-10-27 12:28:31.0  )
Sandeep Kishan: యంగ్ బ్యూటీతో కలిసి షాకిచ్చిన టాలీవుడ్ హీరో సందీప్ కిషన్.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్(Sandeep Kishan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఏడాది కెప్టెన్ మిల్లర్(Captain Miller), ఊరుపేరు భైరవకోన, రాయన్(Raayan) వంటి చిత్రాల్లో నటించి వరుస హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు సందీప్ కిషన్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన(Trinadha Rao Nakkina ) దర్శకత్వంలో ‘మజాకా’ మూవీ చేస్తున్నాడు. అయితే దీనిని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్(AK Entertainments), హాస్య మూవీస్, జీ స్టూడియోస్ బ్యానర్స్ పై రాజేష్ దండా(Rajesh Danda) నిర్మిస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా 2025 సంక్రాంతి(Sankranti) కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ క్రమంలో.. తాజాగా, సందీప్ కిషన్(Sandeep Kishan) షూటింగ్‌ సెట్‌తో యంగ్ బ్యూటీ రితూ వర్మ(Ritu Verma) జాయిన్ అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ సందీప్ కిషన్ ఓ షాకింగ్ వీడియో షేర్ చేశాడు. అయితే ఇందులో రితూ వర్మ(Ritu Verma) పెళ్లి కూతురు గెటప్‌లో ఉండగా.. బీచ్ వద్ద సందీప్ కిషన్ ఆమె ముక్కు పిండుతాడు. దీంతో ఈ యంగ్ బ్యూటీ చితకొట్టేస్తుంది. ఇక ఈ విడియో చూసిన వారు షాక్ అవుతున్నారు. సడెన్‌గా సందీప్, రితూలను అలా చూసి పెళ్లి చేసుకున్నారని అనుకున్నారు. కానీ ఆ తర్వాత అది సినిమా గురించి అని తెలియడంతో కాస్త ఊపిరిపీల్చుకున్నారు. అయితే సందీప్ పోస్ట్ చూసిన కొందరు మొత్తానికి ఇద్దరు కలిసి మాకు షాకిచ్చారుగా అని కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story