మమ్మల్ని రక్షించండి

by Sridhar Babu |   ( Updated:2024-10-26 13:56:50.0  )
మమ్మల్ని రక్షించండి
X

దిశ, భద్రాచలం : ఛత్తీస్‌గడ్ సుకుమా జిల్లాలో డ్రోన్ బాంబుల (Drone bombs)కలకలం రేపుతున్నాయి. తమ గ్రామాలపైకి డ్రోన్ బాంబులు వేస్తున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. బాంబు శకలాలు కూడా చూపించి ఆందోళన వ్యక్తం చేశారు. సుకుమా జిల్లా పువ్వర్తి సీఆర్పీఎఫ్ (CRPF)బేస్ క్యాంప్ సమీప గ్రామాల్లోని పంటపొలాల్లో డ్రోన్ బాంబుల శకలాలు లభ్యం అయ్యాయి. ఆదివాసీ గ్రామాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులే డ్రోన్ బాంబుల వర్షం కురిపిస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చెందు తున్నారు. అయితే గ్రామాలపై బాంబుల వర్షం కురిపిస్తున్నారని ఆరోపిస్తున్న ఆదివాసీలు ప్రాణ నష్టం, గాయాలు అయిన వివరాలు వెల్లడించ లేదు.

టేకులగూడెం-జేగురుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండపల్లి, గుండం పువ్వర్తి , బట్టిగూడ ఆదివాసీ గ్రామాలపై నిత్యం పోలీసులు డ్రోన్ దాడులు చేస్తున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. సమీప అటవీ ప్రాంతాలలో ఎన్కౌంటర్ జరిగినప్పుడు మావోయిస్టులు, భద్రతా బలగాలు వీరిలో ఎవరో ఒకరు రాకెట్ లాంచర్స్ ప్రయోగించినప్పుడు సమీప పంటపొలాల్లో పడి ఉండవచ్చని కొందరు పేర్కొంటున్నారు. తమపై జరుగుతున్న బాంబు దాడుల గురించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని, తమని రక్షించాలని జర్నలిస్ట్ లకు కొందరు సమాచారం అందించారు.

Advertisement

Next Story
null