Elephants: రోడ్డుపై గుంపులు గుంపులుగా తిష్ట.. 3 గంటలుగా నిలిచిపోయిన రాకపోకలు

by srinivas |
Elephants: రోడ్డుపై గుంపులు గుంపులుగా తిష్ట.. 3 గంటలుగా నిలిచిపోయిన రాకపోకలు
X

దిశ, వెబ్ డెస్క్: పార్వతీపురం మన్యం జిల్లా(Parvathipuram Manyam District)లో ఏనుగుల గుంపు(Elephants) సంచారం కొనసాగుతోంది. పెద్దబండపల్లి(Pedbandapally) సమీపంలో ఇటీవల రైతు యాకోబుపై దాడి చేసి చంపిన గజరాజులు పరిసర ప్రాంతాల్లోనే సంచరిస్తున్నాయి. అటవీ ప్రాంతంలో నుంచి జనారణ్యంలోకి వెళ్లి తిరుగుతున్నాయి. స్థానిక పొలాలను ధ్వంసం చేయడమే కాకుండా గ్రామాలకు వెళ్లే రోడ్డుపై హల్ చల్ చేస్తున్నాయి. రహదారిపై గుంపులుగుంపులుగా నిలుస్తున్నాయి. ఎంత హారన్ కొట్టినప్పటికీ కదలడంలేదు. రోడ్డుపైనే తిష్టవేశాయి. దీంతో ఏనుగులకు దూరంగా వాహనదారులు వేచియున్నారు. ఈ ఘటనలో రోడ్డుపై రాకపోకలకు 3గంటలకుపైగా రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి సమయం కావడంతో వాహదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గజరాజులను త్వరగా బంధించి అటవీ ప్రాంతంలో వదలివేయాలని కోరుతున్నారు. మరోవైపు చుట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏనుగులు ఎప్పుడు ఏం చేస్తాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Next Story