Telangana Cabinet: మెట్రో విస్తరణకు తెలంగాణ కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌

by Gantepaka Srikanth |
Telangana Cabinet: మెట్రో విస్తరణకు తెలంగాణ కేబినెట్‌ గ్రీన్‌సిగ్నల్‌
X

దిశ, వెబ్‌డెస్క్: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాయలం(Telangana Secretariat)లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన కేబినెట్(Telangana Cabinet) భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మెట్రో(Hyderabad Metro) రైల్‌ మార్గాల విస్తరణకు తెలంగాణ కేబినెట్‌(Telangana Cabinet) గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. నాగోల్‌ నుంచి LB నగర్‌, LB నగర్‌ నుంచి హయత్‌ నగర్‌, LB నగర్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో విస్తరణ పనులకు లైన్ క్లియర్ అయింది. దీంతో పాటు ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోపై కేబినెట్(Cabinet) చర్చించింది. ఇప్పటి వరకు వేసిన కేబినెట్ సబ్ కమిటీలు, వాటి నివేదికలపై మంత్రివర్గంలో చర్చ జరిగింది. ముఖ్యంగా ములుగు జిల్లాలో సమ్మక్క సారలమ్మ సెంట్రల్ యూనివర్సిటీకి భూ కేటాయింపు, మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్, హన్మకొండ , వరంగల్ జిల్లాల పరిధి పెంపు, ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి అంగీకరించింది. సన్న బియ్యానికి 500 రూపాయల బోనస్‌కు కేబినెట్(Telangana Cabinet) ఆమోదం తెలిపింది.

Advertisement

Next Story