Medaram Jathara: మినీ మేడారం జాతర తేదీలు ఖరారు

by Gantepaka Srikanth |
Medaram Jathara: మినీ మేడారం జాతర తేదీలు ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో జరుగబోయే మినీ మేడారం జాతర(Medaram Jathara) తేదీలు ఖరారు అయ్యాయి. 2025 ఫిబ్రవరి 12 నుంచి 15 ఫిబ్రవరి వరకు జాతర జరుగనున్నట్లు అధికారులు తెలిపారు. జాతరకు సంబంధించిన ఏర్పాటు ప్రారంభించాలని రాష్ట్ర దేవాదాయ శాఖను మేడారం పూజారుల సంఘం శనివారం కోరింది. కాగా, ఈ మినీ మేడారం జాతర(Medaram Jathara)లో అమ్మవార్లను గద్దెలపైకి తీసుకొస్తారు. గద్దెలపైన ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం మహా జాతర జరుగనున్న సంగతి తెలిసిందే.

మాఘ శుద్ధ పౌర్ణమి సందర్భంగా మేడారంలో నాలుగు రోజుల పాటు జాతరను గిరిజన సంప్రదాయంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. ఈ నాలుగు రోజుల సమయంలో నిత్యం లక్షల మంది భక్తులు సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు తరలివస్తుంటారు. సారలమ్మ(Saralamma), సమ్మక్క(Sammakka) గద్దెలకు చేరే నాటి నుంచి తిరిగి వన ప్రవేశం చేసేంతవరకు దాదాపు భక్తుల సంఖ్య కోట్లకు చేరుతుంది. దీంతో మేడారం మహాజాతరలో ఫుల్ రష్ కనిపిస్తుంటుంది. రాష్ట్ర నలుమూలల నుంచి ఈ జాతరకు తరలి వస్తుంటారు.

Advertisement

Next Story