Psycho with knife: ఆలయంలో దూరిన సైకో.. కత్తితో వీరంగం

by karthikeya |
Psycho with knife: ఆలయంలో దూరిన సైకో.. కత్తితో వీరంగం
X

దిశ, వెబ్‌డెస్క్: శుక్రవారం రాత్రి తెలంగాణ (Telangana) జిల్లా మహబూబాబాద్‌‌ (Mahabubabad)లో ఓ సైకో తనని తాను కత్తితో పొడుచుకుని వీరంగం సృష్టించిన విషయం మరువక ముందే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని అన్నమయ్య జిల్లా (Annamaiah)లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. ఓ సైకో (Psycho) కత్తితో జనాలను బెదిరిస్తూ ఏకంగా అమ్మవారి గర్భగుడిలోకి దూరి విగ్రహం ఎదురుగా కూర్చుని పిచ్చి చేష్టలు చేశాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆరవపల్లి ముత్తు మారమ్మ గుడిలో జరిగింది. నిందితుడిని రాజస్థా్‌న్‌ (Rajasthan)కు చెందిన రాజేష్‌గా గుర్తించారు. రైల్వే పోలీసుల (Railway Police) నుంచి తప్పించుకుని గర్భగుడిలోకి దూరినట్లు అధికారులు చెప్పారు. ఘటన సమాచారం అందిన వెంటనే ఆలయం వద్దకు చేరుకున్న నందలూరు పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకుని రైల్వే పోలీసులకు అప్పగించారు.

Advertisement

Next Story

Most Viewed