- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘ప్రపంచంలోనే ఈ రకమైన వింత పోకడ ఎక్కడ చూసి ఉండరు’.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇటీవల విద్యుత్ చార్జీల పెంపు పై వైఎస్సార్సీపీ(YSRCP) ధర్నాకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ వైసీపీ ధర్నా పై విద్యుత్ శాఖ మంత్రి(Minister of Power) గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravikumar) స్పందించారు. ఈ నేపథ్యంలో ఈ రోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలన పై నిప్పులు చెరిగారు. వైసీపీ పెంచిన విద్యుత్ ఛార్జీల(Electricity charges)కు వాళ్లే ధర్నాకు పిలుపునివ్వడం హాస్యాస్పదమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శించారు. ప్రపంచంలో ఈ తరహా వింత పోకడ ఎక్కడా చూసి ఉండరని ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలో ధర్నా చేయాల్సింది కలెక్టరేట్లలో కాదని.. జగన్(YS Jagan) ఇంటి ముందు ధర్నా చేయాలని పేర్కొన్నారు. ప్రజలపై విద్యుత్(Electricity) భారం మోపాలని ఈఆర్సీకి సిఫార్సు చేసింది జగన్ కదా? అని ప్రశ్నించారు. గతంలో టీడీపీ ప్రభుత్వం రాష్ట్రానికి మిగులు విద్యుత్ ఇచ్చింది. విద్యుత్ రంగ వ్యవస్థలను జగన్ ఎలా నాశనం చేశారో అందరికీ తెలుసు అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జగన్ హయాంలోనే వసూళ్లకు డిస్కంలు అనుమతి కోరాయని తెలిపారు. అనుయాయులకు దోచి పెట్టేందుకు అధిక ధరలతో కొనుగోళ్లు చేశారు. రాష్ట్రాన్ని రివర్స్ పాలనతో అట్టడుగు స్థాయికి తీసుకెళ్లారు అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.