- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎస్సై, కానిస్టేబుల్ తో పాటు మరొకరి ఆత్మహత్య అనుకోని సంఘటన.. ఎస్పీ సింధు శర్మ
దిశ, కామారెడ్డి : బిక్కనూర్ ఎస్సై సాయి కుమార్, కానిస్టేబుల్ శ్రుతి, సొసైటీ కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ ఆత్మహత్యల పై జిల్లా ఎస్పీ సింధు శర్మ స్పందించారు. ముగ్గురి ఆత్మహత్య అనుకోని ఘటనగా తెలిపారు. నిన్న సాయంత్రం నుంచి ముగ్గురు కనిపించడం లేదని తెలిసినప్పటి నుంచి ఫోన్ ట్రేసింగ్ ద్వారా గుర్తించామన్నారు. రాత్రి శ్రుతి, నిఖిల్ మృతదేహాలు లభ్యమవగా ఇవాళ ఉదయం ఎస్సై మృతదేహం లభించిందన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు ఇప్పుడే చెప్పలేమన్నారు.
పోస్టుమార్టం నివేదిక ఆధారంగా వివరాలు వెల్లడిస్తామన్నారు. కుటుంబ సభ్యుల ద్వారా వివరాలు సేకరిస్తామన్నారు. మరోవైపు ఎస్సై సాయి కుమార్, కానిస్టేబుల్ శ్రుతి, ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలకు జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. జిల్లా ఎస్పీ సింధూశర్మ ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి పోస్టుమార్టం పూర్తయి మృతదేహాలను తరలించే వరకు ఆసుపత్రి వద్దే ఉండనున్నారు. కానిస్టేబుల్ శ్రుతి, ఆపరేటర్ నిఖిల్, ఎస్సై సాయికుమార్ మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయింది. ముగ్గురు మృతదేహాలను వారి స్వగ్రామాలకు ప్రత్యేక అంబులెన్స్ లో తరలించారు.