- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రెవెన్యూ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి...
దిశ, దమ్మపేట : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి, అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో దమ్మపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని అన్ని చాంబర్లు తిరిగి పరిశీలించారు. అనంతరం సుమారు 30 నిమిషాలకు పైగా తహశీల్దార్ గదిలో కూర్చొని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. గతంలో జరిగిన సక్సెషన్, మ్యుటేషన్, రిజిస్ట్రేషన్, పార్టిషన్ అప్లికేషన్లను పరిశీలించారు. అనంతరం దరఖాస్తుదారులకు నేరుగా ఫోన్లు చేసి కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు అధికారులు తెప్పించుకున్నారు.
భూములు రిజిస్ట్రేషన్ కు సంబంధించిన పనులకు ఏమైనా వస్తే అధికారులు ఏమైనా లంచాలు అడుగుతున్నారా, అధికారుల వ్యవహార శైలి ఎలా ఉంది అని నేరుగా లబ్ధిదారులకు కాల్ చేసి వివరాలు తెలుసుకున్నారు. దమ్మపేట రెవెన్యూ కార్యాలయం పై ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని అందుకే తనిఖీ చేసినట్లు దరఖాసుదారులకు తెలిపారు. దమ్మపేట తహశీల్దార్ సెలవులో ఉండటంతో దమ్మపేట డిప్యూటీ తహశీల్దార్ నుండి వివరాలు సేకరించారు. అక్కడే ఉన్న ఆర్డీవో, డిప్యూటీ తహశీల్దార్ ద్వారా అన్ని రికార్డులు తెప్పించుకొని పరిశీలించారు. వారసులు కానీ వారికి పట్టా బదలాయింపులు చేయొద్దని హెచ్చరిస్తూ ఆదేశించారు.