మందుబాబులకు అడ్డాగా మారిన డంపింగ్ యార్డ్..

by Sumithra |
మందుబాబులకు అడ్డాగా మారిన డంపింగ్ యార్డ్..
X

దిశ, సిరికొండ : సిరికొండ మండలంలోని పొన్న గ్రామ పంచాయతీ పరిధిలోని పొన్న ఎక్స్ రోడ్డు పరిధిలోని గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డంపింగ్ యార్డ్ ఇప్పుడు మందుబాబులకు అడ్డాగా మారిందని గ్రామ ప్రజలు వాపోతున్నారు. తెలంగాణ క్రీడా ప్రాంగణం బోర్డ్ తొలగించి పక్కకి పడేశారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు ఈ పరిస్థితి గ్రామప్రజలకు నిత్యం ఇబ్బందులను కలిగిస్తోంది ఫోటోలో కనిపిస్తున్న సీసాలు, చెత్త ఇతర వస్తువులు డంపింగ్ యార్డ్ వద్ద కనిపిస్తుంది.

రోడ్డు పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ చెత్తతో చెల్లా చెదురుగా అవుతూ దుర్గంధం వస్తుంది. డంపింగ్ యార్డ్ లో పార్టీలు చేసుకునే అడ్డాగా మారిందంటూ ప్రజలు చెప్పుకుంటున్నారు. అధికారులు నిత్యం వెళ్లే దారిలో ఉన్నప్పటికీ చూసి చూడనట్టు వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదని ప్రజలు ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లేక పోవడం పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా పనులపై ప్రత్యేక అధికారులు చొరవ చూపి పనులు సక్రమంగా కొనసాగేలా చూడాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed