- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pawan Kalyan:‘నా అభిమాని వారే’ ఇన్నాళ్లకు సంచలన పేరు రివీల్ చేసిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్
దిశ, సినిమా: పవర్ స్టార్ పవర్ కల్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపడుతున్నారు. ఎన్నో అపజయాల తర్వాత పవన్ ఘన విజయం సాధించడంతో మెగా కుటుంబం అండ్ అభిమానులు చాలా ఎమోషనల్ అయిపోయారు. సంతోషంలో మునిగితేలారనడంలో అతిశక్తిలేదు. ప్రస్తుతం ఈ హీరో ఏపీ డిప్యూటీ సీఎం కావడంతో ఈయనకు సంబంధించిన మూడు సినిమాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీంతో దర్శక,నిర్మాతలు పవన్ కల్యాణ్ డేట్ కోసం నానా తంటాలు పడుతున్నట్లు తెలుస్తోంది. కేవలం పది రోజులు డేట్స్ ఇచ్చిన చాలనుకుంటున్నట్లు నెట్టింట టాక్ నడుస్తోంది.
ఇప్పటికే ఓజీ చిత్ర షూటింగ్ కోసం పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సోషల్ మీడియాలో ఇటీవలే వార్తలు గుప్పుమన్నాయి. ఓజీ, హరహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల కోసం పవర్ స్టార్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కానీ ఏం లాభం.. పవన్ కల్యాణ్ ఓ వైపు డిప్యూటీ సీఎం బాధ్యతలు స్వీకరించాలి, మరోవైపు సినిమా షూటింగ్ అంటే కష్టమైపోతున్నట్లు తెలుస్తోంది. కానీ పవన్ ఎలాగైనా ఈ మూడు చిత్రాలు కంప్లీట్ చేసే సూచనలు కనిపిస్తున్నాయంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు.
ఇకపోతే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కామన్‌గా చాలా మంది పవర్ స్టార్ అంటే ఎంతలా పడిచస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంట. కాగా ఈ హీరో అభిమాని ఎవరని చాలా మందిలో ఈ ప్రశ్న తలెత్తే ఉంటుంది. పవన్ ఫ్యాన్ ఎవరో ఇటీవలే రివీల్ చేశారు. ఈయనకు దేశం కోసం, ప్రజల కోసం తమ జీవితాలను సైతం లెక్కచేయకుండా ప్రాణాలను ఫణంగా పెట్టే శాస్త్రవేత్తలు అంటే ఇష్టమని చెప్పారు.
వారు తనకు రియల్ హీరోలని తెలిపారు. ప్రజల కోసం తమ జీవితాన్ని ధారపోసే శాస్త్రవేత్తలే పవన్ కల్యాణ్‌కు స్ఫూర్తి ప్రధాతలని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా శాస్త్ర సాంకేతిక రంగాల ప్రతిఫలాల వెనకున్న ఎంతో మంది శాస్త్రవేత్తల త్యాగాల గురించి వెల్లడించారు. ప్రతి చిన్న విషయానికి కుంగిపోయే నేటి తరం యువతకు శాస్త్రవేత్తలే స్ఫూర్తిప్రదాతలుగా దారి చూపేట్టాలని వెల్లడించారు. దేశానికి ఏదో ఒక మంచి చేయాలనే వారి అమూల్యమైన ఆలోచనే ఎంతో గొప్పదని కొనియాడారు.