Thangalaan: జీరో కట్స్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘తంగలాన్’ రన్ టైమ్ ఎంతంటే?

by Prasanna |   ( Updated:2024-07-31 08:07:16.0  )
Thangalaan: జీరో కట్స్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్న ‘తంగలాన్’ రన్ టైమ్ ఎంతంటే?
X

దిశ, సినిమా: తమిళ సినీ ఇండస్ట్రీలో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ "తంగలాన్". పా. రంజిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్నాడు. కొలార్‌ గోల్డ్‌ ఫీల్డ్స్‌లో లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా నిర్మించారు. విక్రమ్ కూడా తన పాత్ర విషయంలో ఎక్కడా తగ్గకుండా ఎన్నడూ చేయని విధంగా చేస్తున్నాడు. మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కథానాయికలుగా నటించారు.

తాజాగా ఈ మూవీకి సంబందించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ మూవీ టీమ్‌ వెల్లడించింది. సెన్సార్ బోర్డు తంగలాన్ మూవీకి క్లీన్ యు/ఏ ( U/A ) సర్టిఫికేట్‌ ఇచ్చింది. ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఒక్క కట్ కూడా లేకుండా గమనార్హం. రన్‌టైమ్‌ 2 గంటల 36 నిమిషాల 59 సెకండ్స్‌ గా ఉందని అధికారికంగా ప్రకటించింది. సెన్సార్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ పెద్ద హిట్ గా నిలుస్తుందని చిత్ర టీం భావిస్తోంది. విక్రమ్ అభిమానులు ఈ మూవీ చాలా వెయిట్ చేస్తున్నారు.

ఆగస్టు 15 న "తంగలాన్" మూవీ థియేటర్లలో విడుదలవుతుంది. స్టూడియో గ్రీన్, నీలం ప్రొడక్షన్స్ కలిసి నిర్మించిన ఈ మూవీకి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించారు. అదే రోజున ‘డబుల్ ఇస్మార్ట్’, మిస్టర్ బచ్చన్ వంటి బడా హీరోల సినిమాలు కూడా ఉన్నాయి. వీటిలో ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed