- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Akkineni Nageswara Rao : తారక్ ఆ స్టార్ హీరో గురించి తన డైరీలో ఏం రాశాడంటే..?
దిశ, వెబ్‌డెస్క్: దివంగత సీనియర్ స్టార్ హీరో నందమూరి తారకరావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఒకప్పుడు టాలీవుడ్‌లో వరుస సినిమాలు.. వరుస హిట్లు కొడుతూ.. ప్రముఖ హీరోగా పేరు దక్కించుకున్నారు. కేవలం పరిశ్రమలోనే కాకుండా పాలిటిక్స్‌లో కూడా సత్తా చాటారు. సీఎం పదవి చేపట్టి ప్రజలకు సేవ చేశారు. అయితే ఈ హీరో, అక్కినేని నాగేశ్వరరావు అప్పట్లో ప్రాణ స్నేహితులట. ఇండస్ట్రీలోని కొందరి వ్యక్తుల వల్ల వీరిద్దరి మధ్య మనస్పర్థాలు ఏర్పడ్డాయట. అప్పటి నుంచి వీరు మొదట్లో ఉన్నంత సన్నిహితంగా తర్వాత ఉండలేకపోయారు. అయితే తారక్ చనిపోయే ముందు నాగేశ్వరరావుకు ఫోన్ చేసి..‘నీతో కలిసి భోజనం చేయాలి. అలాగే నీతో మాట్లాడాలి. ఇంటికి రా’ అని ఎంతో ఆప్యాయంగా పిలిచారట. సరే వస్తానని నాగేశ్వరరావు చెప్పి, బయల్దేరే సమయంలోనే ఎన్టీఆర్ మరణించారని తెలిసిందట.
కాగా ‘‘కొందరి వల్ల మన ఇద్దరి మధ్య మనస్పర్థాలు వచ్చాయి. దానికి మనమిద్దరం బాధపడ్డాం. అందులో నా తప్పు ఉంటే నన్ను క్షమించు’’ అని ఎన్టీఆర్ డైరీలో రాసుకున్నారట. ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రచయిత కృష్ణకుమారి వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read More: పవన్ కల్యాణ్ పావలా మ్యానరిజంతో డైరెక్టర్ స్టోరీనే మార్చేసి ఫ్లాప్ ఇచ్చారంటూ..! శ్రీరెడ్డి ట్వీట్