మా పెళ్లి వీడియోను ఎవరికీ అమ్ముకోలేదు.. ఆ పుకార్లు నిజం కాదు : Varun Tej

by sudharani |   ( Updated:2023-11-08 13:08:24.0  )
మా పెళ్లి వీడియోను ఎవరికీ అమ్ముకోలేదు.. ఆ పుకార్లు నిజం కాదు : Varun Tej
X

దిశ, సినిమా: మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి నవంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇరు కుటుంబాల అంగీకారంతో దంపతులుగా కొత్త జీవితాన్ని ఆరంభించారు. ఇటలీలోని టస్కానీలో జరిగిన ఈ వివాహానికి కొణిదెల ఫ్యామిలీ, అల్లు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇకపోతే వీరి పెళ్లికి సంబంధించిన వీడియో స్ర్టీమింగ్ హక్కులను ఓ OTT ప్లాట్ ఫామ్‌కు ఇచ్చారని కొన్ని పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. కాగా దీనిపై తాజాగా వరుణ్ టీమ్ సోషల్ మిడియాలో క్లారిటి ఇచ్చింది.

‘వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం ఓటీటీ హక్కుల గురించి వస్తున్న పుకార్లు అన్నీ నిరాధారమైనవి. అవాస్తవమైనవి. ఇలాంటి రూమర్స్ నమ్మి, ప్రచారం చేయవద్దని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం’ అని వరుణ్ తేజ్ టీమ్ ట్వీట్ చేసింది. దీంతో వరుణ్ - లావణ్య పెళ్లి ఓటీటీ రైట్స్ రూ.10 కోట్లకు నెట్‌ఫ్లిక్స్ పొందడం అనేది అవాస్తవమే అని తేలిపోయింది.

Advertisement

Next Story