‘3 ఇడియట్స్’ అభిమానులకు గుడ్ న్యూస్.. సీక్వెల్‌పై నటుడి క్లారిటీ

by samatah |   ( Updated:2023-07-08 07:39:00.0  )
‘3 ఇడియట్స్’ అభిమానులకు గుడ్ న్యూస్.. సీక్వెల్‌పై నటుడి క్లారిటీ
X

దిశ, సినిమా: ‘3 ఇడియట్స్’ అభిమానులకు మేకర్స్ నుంచి మరో గుడ్ న్యూస్ వెలవడనున్నట్లు తెలుస్తోంది. 2009లో అమీర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి, కరీనా కపూర్‌ ప్రధాన పాత్రల్లో సినిమాను తెరకెక్కించిన రాజ్ కుమార్ హిరానీ.. త్వరలోనే ఈ మూవీ సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నట్లు నటుడు శర్మన్ జోషి ఓ సమావేశంలో చెప్పాడు. ‘‘3 ఇడియట్స్’ నిర్మాతలు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారా? అనే ప్రశ్నకు బదులిచ్చిన జోషి.. ‘మేము ఇంతకు ముందు కలిగి ఉన్న కొన్ని ఆలోచనలను తరచుగా గుర్తుచేసుకుంటాం. నిజంగా వాటిని మేము ఎప్పటికీ దూరం చేసుకోలేం. రాజ్‌ కుమార్ హిరానీకి ఈ మూవీ సీక్వెల్‌పై కొంత ఆసక్తి ఉంది. మనందరికీ తెలిసినట్లుగానే హిరానీ సర్ ఏ విషయంలోనూ రాజీపడడు. కాబట్టి ఈ విషయంలోనూ ముందడుగు వేస్తాడనే మేమంతా ఆశిస్తున్నాం. ఈ పని తప్పకుండా చేస్తారు’ అంటూ హింట్ ఇచ్చాడు జోషి.

Advertisement

Next Story