Prabhas: ప్రభాస్.. మీరు ఎక్కడున్నా రాజు రాజేనయ్యా!

by Kavitha |   ( Updated:2024-08-07 07:21:26.0  )
Prabhas: ప్రభాస్.. మీరు ఎక్కడున్నా రాజు రాజేనయ్యా!
X

దిశ, సినిమా: వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడి 360 మందికి పైగా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. విపత్తు బాధితులకు అండగా నిలబడేందుకు సినీ పరిశ్రమలోని పలువురు స్టార్స్ విరాళాలు ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు సాయం ప్రకటించారు. ఈ క్రమంలో ఇటీవల మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రూ.కోటి విరాళాన్ని ప్రకటించగా.. అల్లు అర్జున్ రూ.25 లక్షలను కేరళ సీఎం రిలీఫ్ ఫండ్‌కు విరాళంగా ఇచ్చారు. కాగా ఇప్పుడు ఈ జాబితాలో ప్రభాస్ కూడా చేరారు. ఈ నేపథ్యంలో వయనాడ్ విపత్తు బాధితుల సహాయార్థం కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి రెబల్ స్టార్ ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించి గొప్ప మనసు చాటుకున్నారు. దీంతో డార్లింగ్ ఫ్యాన్స్.. ఎక్కడున్నా రాజు రాజేనయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story