Chiranjeevi: ‘విశ్వంభర’నుంచి క్రేజీ అప్‌డేట్.. టీజర్ వచ్చేది ఆ స్పెషల్ డే నాడేనా!

by Hamsa |
Chiranjeevi: ‘విశ్వంభర’నుంచి క్రేజీ అప్‌డేట్.. టీజర్ వచ్చేది ఆ స్పెషల్ డే నాడేనా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్‌ చిరంజీవి, డైరెక్టర్ వశిష్ట కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’. హైలీ యాంటిసిపేటెడ్‌ క్రేజీ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తుంది. చిరంజీవి సరసన త్రిష నాయికగా నటిస్తున్న ఈ మూవీలో ఆషికా రంగనాథ్‌, కునాల్ కపూర్‌లు ముఖ్యపాత్రలో కనిపించబోతున్నారు. ఈ క్రమంలో విశ్వంభర షూటింగ్‌కు సంబంధించిన విషయాలు బయటకు వచ్చాయి. ఎం.ఎం.కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన మూడు పాటలు చిత్రీకరించారు.

ఒకవైపు షూటింగ్‌తో పాటు చిత్ర వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌ కూడా కొనసాగుతుందని సమాచారం. టాకీ పార్ట్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రంలో ఇంకా రెండు పాటలు బ్యాలెన్స్‌ ఉన్నాయి. తాజాగా, విశ్వంభర నుంచి అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం. చిరంజీవి పుట్టిన రోజు ఆగస్టు 22న ఈ చిత్రం టీజర్‌ను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ సినిమాను 2025 జనవరిలో సంక్రాంతికి విడుదల చేయాలని విశ్వంభర టీమ్ అనుకుంటున్నారు.



Next Story