‘లైలా’గా మారిన విశ్వక్ సేన్.. అమ్మో క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్..!

by Kavitha |
‘లైలా’గా మారిన విశ్వక్ సేన్.. అమ్మో క్యూట్ నెస్ ఓవర్ లోడెడ్..!
X

దిశ, సినిమా: మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక త్వరలో మెకానిక్ సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అలాగే మరో 3 సినిమాలు కూడా చేస్తూ బిజీ బిజీగా ఉన్నా విశ్వక్ సేన్ తాజాగా మరో కొత్త సినిమాని మొదలు పెట్టారు. ఆల్రెడీ గతంలో ‘లైలా’ అనే సినిమా చేయబోతున్న అని విశ్వక్ సేన్ ప్రకటించాడు. షైన్ స్క్రీన్ నిర్మాణంలో రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ మూవీని చేయబోతున్నాడు. కాగా ఈ సినిమాలో ఫస్ట్ టైం అమ్మాయి క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. దీంతో ఇప్పటి వరకు మాస్ క్యారెక్టర్స్ చేసిన విశ్వక్ మొదటి సారి అమ్మాయిగా నటిస్తుండటంతో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ మూవీ కోసం.

అయితే నేడు ఈ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. త్వరలోనే షూటింగ్ మొదలు పెట్టనుంది. ఇక ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తుండగా తాజాగ ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసారు. ఇందులో విశ్వక్ అమ్మాయిలా రెడీ అయ్యాడు. అయితే క్లోజ్‌గా ఫేస్‌లో కళ్ళు మాత్రమే కనపడేలా పోస్టర్ రిలీజ్ చేసారు. ఇక ఈ సినిమా వచ్చే సంవత్సరం వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్‌గా మారింది.


Advertisement

Next Story

Most Viewed